ఆశతో నీ కొరకు ఎదురు

200 Views

ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .
నూతన బలముతో నను నింపినావు (2)
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా (2)
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన (2)         ||ఆశతో||

సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా (2)
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2)     ||యేసయ్యా||

అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై (2)
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకే నేను సాగెదనయ్యా (2)     ||యేసయ్యా||

రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో (2)
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత (2)     ||యేసయ్యా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account