ఆవేదన నేనొందను అవమానముతో

194 Views

ఆవేదన నేనొందను
అవమానముతో నే కృంగను
ఆనందమే నా జీవితం (2)
నా యేసుని బాహూవులో
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా ఆనందమే      ||ఆవేదన||

నాకేమి కావలెనో నేనేమి కోరెదనో (2)
నా ఊహలకు ఊపిరి పోసి
కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన
నీ కార్యములు ఆశ్చర్యమే (2)       ||హల్లెలూయా||

కష్టాల కెరటాల సుడిగుండమందున (2)
కలవరమొంది కృంగిన నన్ను
కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా
కృపలన్నియు కురిపించితివి (2)     ||హల్లెలూయా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account