అక్షయుడా నా ప్రియ యేసయ్యా
Hosanna Ministriesపల్లవి :
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం} [2]
{నీవు నా కోసమే తిరిగి వస్తావని
నేను నీ సొంతమై కలిసి పోదామని
యుగయుగములు నన్నేలు తావని
నీకే నా ఘన స్వాగతం} [1]
|అక్షయుడా|
చరణం :1️⃣
{నీ బలిపీఠ మందు పక్షులకు
వాసమే దొరికెనే…
అది అపురూపమైన నీ దర్శనం
కలిగి జీవించు నే…
నేనే మందును ఆకాంక్షితును
నీతో ఉండాలని కల నెరవేరునా
నా ప్రియుడా యేసయ్యా…
చిరకాల ఆశను నెరవేర్చు తావని
మదిలో చిరు కోరికా} [1]
|అక్షయుడా|
చరణం :2️⃣
{నీ అరచేతిలో నన్ను చెక్కుకొని
మరువలేదంటివే…
నీ కనుపాపగా నన్ను కాచుకొని
దాచుకుంటావులే…
నన్ను రక్షించిన ప్రాణమర్పించిన
నన్ను స్నేహించిన నన్ను ముద్రించిన
నా ప్రియుడా యేసయ్యా…
పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయా} [1]
|అక్షయుడా|
చరణం :3️⃣
{నీవు స్థాపించిన ఏ రాజ్యమైన
కొదవ లేకుండెనే…
బహు విస్తారమైన నీ కృపయే
మేలుతో నింపునే…
అది స్థిరమైనదై క్షేమము నొందనే
నీ మహిమాత్మతో నెమ్మది పొందెనే
నా ప్రియుడా యేసయ్యా…
రాజ్యాలనేలే శకపురుషుడా నీకు సాటెవ్వరు} [1]
|అక్షయుడా|