అంబరాన్నంటే సంబరాలు

Joshua Gariki
405 Views

అంబరాన్నంటే సంబరాలు
యేసయ్య పుట్టాడు మన కోసమే
పరమందు దూత ఘనంబులు
భూవిపైకొచ్చారు ఆ రాకకై ” 2 ‘

రారండి చూసొద్దాం యేసయ్యను
రారండి కొలిచేద్దాం మెస్సయ్యను
పశువుల పాకలో పసిబాలుడు
పవళించినాడుకోసమే
అందుకే ఆడిపాడి సంబరమే చేసేద్దాం
Happy Christmas Merry Christmas
Happy Happy Happy Christmas
” అంబరాన్నంటే “

1 ) చీకటిలోనున్న ప్రజలందరూ
ఆ వెలుగులోనికి రావాలని
మన పాప భారాన్ని మోయాలని
మన వ్యాధి బాధల్ని తీయాలని ” 2 ”
” రారండి చూసొద్దాం ” ” అంబరాన్నంటే “

2 ) మరణమే లేని పాపానికి
వెల ఇచ్చి విడుదల ఇవ్వాలని
తన రుధిరమంతా కార్చాలని
ఈ ధరలో ప్రభు రాజ్యం నిలపాలని ” 2 ”
” రారండి చూసొద్దాం ” ” అంబరాన్నంటే “

3 ) బేధమేమియు లేకుండా
అందరి దేవుడు ఉదయించెను
చరిత్ర భాగాలుగా చేసెను
శక పురుషుడై యేసు ఇల నిలిచెను ” 2 ”
” రారండి చూసొద్దాం ” ” అంబరాన్నంటే “

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account