అమ్మవే మా నాన్నవే
అమ్మవే మా నాన్నవే ఆధారము నీవే యేసయ్యా
ఎవ్వరూ లేనే లేరయ్యా నాకున్నది నీవేనయ్యా ..2..
కడుపునిండ తిండి నాకు లేకపోయెను
కన్నీరే నాకు అన్నపానమాయెను ..2..
నన్ను చూడయ్యా ఈస్థితి మార్చయ్యా
నీదిక్కు చూస్తున్నా ఆశతో ..2..
..అమ్మవే..
1. గూడు లేదయ్యా నాకు అండ లేదయ్యా
చెట్టు నీడలో బ్రతుకు చుంటిని ..2..
చెత్త కుండి నన్ను పోషించు చుండెను
పాడైన తిను బండారాలతోను ..2..
నన్ను చూడయ్యా ఈస్థితి మార్చయ్యా
నీదిక్కు చూస్తున్నా ఆశతో ..2..
..అమ్మవే..
2. కొంతమంది నన్ను చూసి
పిచ్చివాడు అంటరు
ఎగతాళి చేస్తరు నేనెందు బోదును ..2..
ఒంటరినై కుమిలి నేను ఏడుస్తుంటిని
ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి కృంగిపోతిని..2..
నన్ను చూడయ్యా ఈస్థితి మార్చయ్యా
నీదిక్కు చూస్తున్నా ఆశతో ..2..
..అమ్మవే..
3. ఒక్కసారి చూడయ్యా నాబ్రతుకు మార్చయ్యా
ఈ బ్రతుకంతయు నీకొరకె బ్రతికెదా ..2..
పెంటకుప్ప నుండి నన్ను లేవనెత్తయ్యా
ఈ మొఱ్ఱను విని నన్ను దీవించరావయ్యా ..2..
కన్న తల్లిలా కన్న తండ్రిలా
గోస తీర్చినవు నీకే వందనం ..2..
..అమ్మవే..