అపరాధిని యేసయ్యా

806 Views

అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో అపరాధములను క్షమించు

1.ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని
క్రూరుండనై కొట్టితిని ఘోరంబు పాపిని దేవా

2.చిందితి రక్తము నాకై పొందిన దెబ్బలచేత
అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా

3.శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా
అక్షయభాగ్యమునియ్య మోక్షంబు జూపితివయ్యా

4.దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితిని దేహంబు గాయములను

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account