అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము

Hosanna Ministries
48362 Views

అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా

సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి

సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా

సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account