కల్వరి స్వరము నీ కొరకే

Sathish Kumar
283 Views

కల్వరి స్వరము నీ కొరకే
సుమధుర స్వరము మన కొరకే
మరి ఆలకించుమా ప్రభు స్వరము ప్రియ స్వరము ॥2॥
సా… సగరిగ సానీ… పా… మాగమపా… ॥12॥

సత్యము తెలియని గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరము
శాంతి లేకటు బ్రతుకలేకిటు అల్లాడుచున్న వారికి స్వరము
ఆశల అలలో నిరాశల వలలో ॥2॥
చిక్కిన వారికి కల్వరి స్వరము చిక్కిన వారికి వ్రభునీ స్వరము

గాలి తుఫానులో చెదరిన వారిని దరికి చేర్చును కల్వరి స్వరము
చితికిన బ్రతుకును పగిలిన గుండెను
ఆదరించును ప్రియుని స్వరము
దాహముగొనినా వారలకెల్లా…. 12॥
సేదదీర్చును కల్వరి స్వరము సేదదీర్చ్సును ప్రభునీ స్వరము

మార్చును కోరక తీర్పును తలచక తిరుగువారికి కల్వరి స్వరము
పైకి భక్తితో లోపల రక్తితో బ్రతుకు వారికి కల్వరి స్వరము
వేడిగ లేక చల్లగ లేక…. 12
నులివెచ్చగుండే వారికి స్వరము నులివెచ్చగుండే వారికి స్వరము

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account