చెదరిపోని నీ ప్రేమయే
John Weslyచెదరిపోని నీ ప్రేమే నా ఆధారం
అంతులేని నీ కృపయే నా ఆదరణ
నా బంధువై నా గమ్యమై – నడిపావు ప్రతి బాటలో
బలియాగమై ఆ సిలువలో – తుడిచావు నా పాపము
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
కనుపాపగా నన్ను కాపాడినావు
కన్నీటి లోయలో నన్ను కౌగలించినావు
శిధిలమైన నా బ్రతుకును – ఆనంద తైలముతో అభిషేకించావు
నా తలపులో నా మాటలో
నా కాపరి నా యేసయ్య
క్షణమైనా నిన్ను మరచి ఉండలేను
గతమంతా నీవు తుడిచివేసినావు
కీర్తించకుండా నేనుండలేను – మారని ప్రేమ నాతోడుండగా
నా తలపులో నా మాటలో
నా కాపరి నా యేసయ్య




















