దాటిపోబోకయ్యా

Shalem Raju
1470 Views

దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య
దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య
యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా
దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య

నా వేదనకు మితి లేదు నా శోకానికి తుది లేదు
నీవు గాక జీవితాన ఆశయే లేదు
నీవు గాక జీవితాన ఆశయే లేదు
నాకోసం నువు వస్తావని నా ఆర్త ధ్వని వింటావని
ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను
దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య

అవమానాల నా బ్రతుకే ఆవేదనలే నిను వెతికే
నీవు గాక దిక్కు లేక దీనమైపోయే
నీవు గాక దిక్కు లేక దీనమైపోయే
నాకోసం నువు వస్తావని నా ఆర్త ధ్వని వింటావని
ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను
దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య
యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా
దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account