దేవా నీ ఆత్మను నా నుండి

309 Views

దేవా నీ ఆత్మను నా నుండి
నువ్వు తీసివేయకుమా
నీ సన్నిధిలో నుండి నన్ను
నువ్వు త్రోసివేయకుమా (2)
నీ దృష్టి యెదుటనే
చెడుతనము చేసియున్నాను
పాపిని అని ఒప్పుకొని
క్షమాపణ కోరుచున్నాను
నీవే నీవే కరుణామయుడవు నీవే
నీవే నీవే ప్రేమామయుడవు నీవే     ||దేవా||

నీ వెలుగుతో నను నింపిననూ
చీకటినే కోరుకున్నాను (2)
నా కళ్ళు నీవు తెరిచిననూ
గ్రుడ్డివాడిలా నడుచుకున్నాను      ||నీ దృష్టి||

నీ ఆత్మతో నను నింపిననూ
శరీరమునే తృప్తిపరిచాను (2)
ఆత్మచేత నడిపించబడక
శరీరాశలలో మునిగాను       ||నీ దృష్టి||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account