Chorantians Bible Quiz
View Allదివిలో వేడుక ఊరంతా పండుగ
Joshua Shaikదివిలో వేడుక – ఊరంతా పండుగ – నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా – ఆ నింగీ తారక – వెలిసే ఈ వింత చూపగా
మహా సంతోషమే – ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో – ఓహో ఉల్లాసమే
ఇల మెస్సయ్య – జన్మించినాడుగా
మన యేసయ్య – ఉదయించినాడుగా
మహారాజు – మన యేసు
నిన్నే కోరీ – ఇలా వచ్చెనే
జగాలేలే – మన యేసు
నిన్నే చేర – దిగి వచ్చెనే
1. దేవ దేవుడే – మరియ తనయుడై
ధరలో దీనుడై – పుట్టే పుణ్యుడై
పరిశుద్ధాత్ముడే – పాపరహితుడై
ప్రేమపూర్ణుడే – పరమ జీవమై
లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
నిను దీవించి తన ప్రేమ చూపాడుగా
దారే చూపంగ దేవుడే
దయతో దీపంగ నిలిచెనే
2. ఆడే గొల్లలు – పాడే దూతలు
వచ్చిరి జ్ఞానులు – వేడిరి యేసుని
ఆ పశుపాకలో – పొంగే సంబరం
మనకు రక్షణై – యేసు ఈ దినం
పాపాన్ని తొలగించ వచ్చాడుగా
నిను కరుణించి తన జాలి చూపాడుగా
కృపతో కాపాడ వచ్చెనే
చెలిమై చల్లంగ చూసెనే