దోషివా…. ప్రభూ…. నువు దోషివా

315 Views

సర్వమానవ పాపపరిహారార్థమై
సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2)

దోషివా…. ప్రభూ…. నువు దోషివా
నీ విధేయతకు నా అవిధేయతకు
మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా (2)
దోషివా…. ప్రభూ…. నువు దోషివా

ఘోరంబుగా నే చేసిన నేరాలకు
నువు పొందిన మరణ శిక్ష
నే నడచిన వక్ర మార్గాలకు
నువు పొందిన సిలువ యాతన (2)
కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2)
నే పొందిన రక్షణా పాత్ర (2)      ||దోషివా||

నే వేసిన తప్పటడుగులకు
నీవు కార్చిన రక్త పు మడుగులూ
నే చేసిన కపటంబులకు
నీవు పొందిన కొరడా దెబ్బలు (2)
సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2)
ప్రేమించితివే నన్ను (2)      ||దోషివా||

తులువలలో ఓ తులువగా నున్న
నా పై నీ దయగల చూపు
పరలోకములో నీతో నుండ
భాగ్యంబును నాకు నిచ్చినదే (2)
తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ (2)
నీ తుది శ్వాస వీడనంటివే (2)      ||దోషివా||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account