ఏ నామములో సృష్టి అంతా

314 Views

ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడెనో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును

నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము

రోగము తలవంచును నీ నామము ఎదుట
శాపము తల వంగును నీ నామము ఎదుట (2)
సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2)       ||నీ నామమునే||

ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత (2)
శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2)       ||నీ నామమునే||

హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా
కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా
అన్ని నామములకు పై నామముగా (2)
అన్ని నామములకు పై నామముగా – (3)       ||నీ నామమునే||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account