Chorantians Bible Quiz
View Allఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2)
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం – (2)
ఒంటరి బ్రతుకును విడిచెదరు
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)
పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని||
గత కాల కీడంతా మరచెదరు
వీనులతో సంతసించెదరు (2)
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో ||దేవుని||
ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధి పొందెదరు (2)
పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో ||దేవుని||