ఏమని వర్ణింతు నా యేసయ్య
Palepogu Lazarbabuఏమని వర్ణింతు నా యేసయ్య కొలతలే లేని నీ ప్రేమను
రాగమా అనురాగమా – బంధమా రక్తసంబంధమా
1. అనుదిన దోషములతో నేను బాహాటముగాసిలువ వేస్తూ
నిన్నుదూషించి ద్వేషించినా విడువలేదే నన్నెన్నడు
ఏమని వర్ణింతు నీ ప్రేమను
2. బహుమూర్థత్వపు ఈ పాపి వలన నలిగి కరిగేనే నీ దేహము
రోదనతో ఆవేదనతో హింసించినా క్షమించావే
ఏమని వర్ణింతు నీ సహనము
3. యేసయ్యా నీ రక్తమే పంచగాయములలో స్రవించే నాకై
సమీపమైన బాందవ్యములు ఎన్నైనను నీకు సరి రావే
ఏమని వర్ణింతు నీ త్యాగము