ఎంత మంచి దేవుడవయ్యా
Prasanna Kumarఎంత మంచి దేవుడవయ్యా… నా యేసు రాజా..
ఎలా వర్ణింతునయ్యా నీ కృపలను దేవా..
నా దోషములన్ని క్షమించే నీ కృప
మరణములో నుండి తప్పించే నీ కృప
నిర్దోష మార్గమున నన్ను నడిపినావు
నీ నిత్య కృపలోని నన్ను పిలిచినావు
ఎంత మంచి దేవుడవయ్యా….
మనుషుల మమత మరుగైపోయనే
నీ ప్రేమయే నాకు శాస్విత మాయనే
నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాచి నావు
నీ నిత్య ప్రేమయే నన్ను ఓదార్చను
ఎంత మంచి దేవుడవయ్యా….
మహిమ లో నుండి అత్యధిక మహిమను
కృప వెంబడి కృపను నేను పొందుకొనుచు
శాశ్వత రాజ్యముకై నేను సిద్ధమవుదును
నా తండ్రి ప్రభువుతో చిరకాలము ఉందును
ఎంత మంచి దేవుడవయ్యా….