ఎంత ప్రేమ యేసయ్యా

Raj Prakash Paul
790 Views

ఎంత ప్రేమ యేసయ్యా ద్రోహినైన నా కొరకు
సిలువలో ఆ యాగము చేసావు రక్తము కార్చావు
ఎందుకో ఈ త్యాగము పాపినైన నాకొరకు
సిలువలో ఆ యాగము నొందెను రక్తము చొందెను
సురూపమైనా సొగసైనా లేకపోయెను
యేసు నిలువెల్ల రక్తధారలు కారిపోయెను
నలిగిపోయెను విరిగిపోయెను

1. ఎంత శ్రమను ఎంత బాధను అనుభవించినాడె విభుడు
మనుకు క్షమాపణ యిచ్చెను అభయము కలుగజేసెను
హింసింపబడి దూషింపబడెను
కరుణతో నను రక్షింప నా కోసమే ఈ యాగమా

2. సమస్తము సంపూర్ణమాయెను జీవముకై మార్గము తెరిచెను
అపవాదిని ఆణచివేసి మరణముల్లును విరచివేసెను
విజయశీలుడై తిరిగి లేచెను పరిశుద్ధాత్మను తోడుగా యిచ్చెను
పునరుత్ధానుడు మనుకు తోడుగా నిత్యము నిలిచే

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account