ఇలలోన సంబరమాయే
Joshua Garikiపల్లవి: దావీదుపురములో యేసయ్య జన్మించెను
బేత్లెహేము ఊరిలో మహారాజు ఉదయించెను//2//
అ.ప : ఇలలోన సంబరమాయే
భువిపైన నిజమైన సందడిఆయే//2//
1. పాపమెరుగని ప్రభుమనకొరకు
పరిశుద్దునిగా భువికొచ్చెను
పాపమునుండి విడుదలనిచ్చి
పరముకు నిన్ను నడిపించును//2//
లోకంలో లేరెవ్వరు..ఇటువంటి దేవుడు మనకు //2//
నమ్మితే చాలు నిత్యజీవము//2// //ఇలలోన//
2. మారని దేవుడు మనయేసయ్య
మార్గముచూపి నడిపిస్తాడు
మరణచ్ఛాయలు తొలగించి
మోక్షరాజ్యము మనకిస్తాడు//2//
లోకంలో లేరెవ్వరు ఇటువంటి దేవుడు మనకు//2//
నమ్మితే చాలు నిత్యజీవము//2// //ఇలలోన//