జన్మించినాడు జన్మించినాడు
జన్మించినాడు జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు
జన్మించినాడు జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు
ఉదయించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు “2”.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిశ్చుడగు తండ్రి సమాధాన అధిపతి “2”
చీకుచింతల నుండి తొలగించు వాడు.
వ్యాధి బాధల నుంచి విడిపించు రక్షకుడు.
సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి
ఆనందం సంతోషంతో నిను నింపువాడు”2″. ఆశ్చర్యకరుడు
సత్య వాక్యమును బోధించువాడు. సర్వ సత్యములోకి నడిపించు నాయకుడు.
మన అందరిలో నివసించు వాడు ఆత్మీయుడు మన ఆత్మలకు రక్షకుడు.”2″ ఆశ్చర్యకరుడు
నిత్య నరకం నుంచి తప్పించువాడు
పరలోక మహిమలో నిలిపే మహనీయుడు
అందరిపైన తేజస్సు నిలిపి పరమ తండ్రికి అర్పించుతాడు.”2″ ఆశ్చర్యకరుడు