జయ సంకేతమా

Hosanna Ministries
1206 Views

పల్లవి.
జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య_2
అపురూపము నీ ప్రతి తలుపు
అలరించిన ఆత్మీయ గెలుపు _2
నడిపించే నీ ప్రేమ పిలుపు
//జయ సంకేతమా//

1.
నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు స్వరము సమకూర్చేనే_2
నన్నెల ప్రేమించ మనసాయెను
నీ మనసెంతో మహోన్నతము
కొంతైనా నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే

సేవించేద నా యజమానుడా-(2)
జయ సంకేతమా

2.
నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే_2
దీపము నాలో వెలిగించగా నా ఆత్మ దీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు
భజియించి నిన్నే కీర్తింతును
జీవితగమనం స్థాపించితివి
సీయోను చేర నడిపించుమా_(2) జయ సంకేతమా

3.
నీ కృప నాయెడల విస్తారమే
ఏనాడు తలవని భాగ్యమిది_2
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా
కొదువేమి లేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా
(జయ సంకేతమా)

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account