కమనీయమైన నీ ప్రేమలోన

320 Views

కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా

కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
(తీయ) తీయని నీ పలుకలలోన
నే కరిగిపోనా నా యేసయ్యా (2)
నా హృదిలో కొలువైన నిన్నే
సేవించనా/సేవించెదా నా యేసయ్యా (2)

విస్తారమైన ఘన కీర్తి కన్నా
కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా
మధురమైనది నీ నామం (2)
సమర్పణతో నీ సన్నిధిని చేరి
నిత్యము నిన్నే ఆరాధించనా (2)         ||కమనీయమైన||

వేసారిపోయిన నా బ్రతుకులో
వెలుగైన నిన్నే కొనియాడనా (2)
కన్నీటితో నీ పాదములు కడిగి
మనసారా నిన్నే పూజించనా (2)
నీ కృపలో గతమును వీడి
మరలా నీలో చిగురించనా (2)         ||కమనీయమైన||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account