కన్నులనెత్తి పైరుల చూడు

Siyonu Geethamulu
157 Views

కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)
ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)

కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)
ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||

మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2)
వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా||

విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2)
జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా||

మందిరము పడియుండ మందుడవై నీవుండి (2)
సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా||

మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2)
నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account