కనులే చూసే ఈ సృష్టే నీదనీ

Praveen Kumar
11952 Views

కనులే చూసే ఈ సృష్టే నీదనీ
నీవు లేకుండా ఏ చోటే లేదనీ
కనులే చూసే ఈ సృష్టే నీదనీ
కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని
నాలో ఉండగోరినావే
నను నీ గుడిగా మార్చినావే
నన్నింతగ కరుణించావే
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఇలా నన్ను మలిచావయ్యా
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఎలా నిన్ను పొగడాలయ్యా

1. అద్బుత సృష్టిని నే చూడను
నా రెండు కనులు చాలవే
జరిగించిన కార్యములు
నా ఆలోచనకందవే
నీ దృష్టిలో ఉన్నానయ్యా
నీ చేతిలో దాచావయ్యా
ఎంతటిదానను నేనయ్యా
అంతా నీ దయే యేసయ్యా

2. సాయముకోరగ నిను చేరిన
ఏ బలహీనతను చూడవే
గతకాలపు శాపాలను
నా వెంటను రానీయవే
సాధనే నేర్పావయా
సాధ్యమే చేసావయా
గురిగా నిన్ను చూసానయా
ఘనముగ నన్ను మార్చావయా

3. నీ చేతిపని ఎన్నడైనా
నీ మాటను జవదాటవే
వివరించ నీ నైపుణ్యము
చాలిన పదములే దొరకవే
స్తోత్రమే కోరావయ్యా
కీర్తనే పాడానయ్యా
ఇంతటి భాగ్యమిచ్చావయ్యా
సేవలో సాగిపోతానయ్యా

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account