కరుణాసాగర

Hosanna Ministries
2918 Views

కరుణాసాగర యేసయ్యా
కనుపాపగ నను కాచితివి
ఉన్నతమైన ప్రేమతో
మనసున మహిమగా
నిలిచితివి

మరణపులోయలో దిగులు చెందగా
అభయము నొందితి నినుచూచి
దాహముతీర్చిన జీవనది
జీవమార్గము చూపితివి

యోగ్యతలేని పాత్రనునేను
శాశ్వతప్రేమతో నింపితివి
ఒదిగితిని నీ కౌగిలిలో
ఓదార్చితివి వాక్యముతో

అక్షయస్వాస్థ్యము నే పొందుటకు
సర్వసత్యములో నడిపితివి
సంపూర్ణపరచి జ్యేష్ఠులతో
ప్రేమనగరిలో చేర్చుమయ్యా