కురిసింది తొలకరి వాన
Hosanna Ministriesపల్లవి :👨🎤👩🎤
{కురిసింది తొలకరి వాన నా గుండెలోన} [2]
{చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై} [2]
{నీ నిత్య కృపయే వాత్సల్యమై
నీ దయయే హెర్మోను మంచువలే} [2]
{పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య} [2]
|కురిసింది|
చరణం :1️⃣
{దూలినై పాడైన ఎడారిగా నను చేయక
జీవజల ఊటలు ప్రవహింపజేశావు} [2]
{కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక
సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు} [2]
{స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా} [2]
|పొంగిపొరలి|
చరణం :2️⃣
{నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి
నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి} [2]
{నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక
నీ ప్రభావ మేఘముతో సాక్షిగ నను నడిపితివి} [2]
{తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా} [2]
|పొంగిపొరలి|
చరణం :2️⃣
{నా తొలకరి వర్షము నీవై చిగురింపజేసావు
నా ఆశల ఊహలలో విహరింపజేశావు} [2]
{నా కడవరి వర్షము నీవై ఫలింపజేసావు
నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు} [2]
{హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగర} [2]
|పొంగిపొరలి|