తలుచుకుంటె చాలును

Sathish Kumar
589 Views

తలుచుకుంటె చాలును – ఓ యేసు నీ ప్రేమ
జలజల జల రాలును – కృతజ్ఞతా కన్నీళ్ళు
తలుచుకొంటే చాలును – కరిగించును రాళ్ళను
కల్వరి స్వరము – ఇది కల్వరి స్వరము [తలుచుకుంటె

1. నీ మోమున ఊసిన ఉమ్ములు
నా మోహవు చూపవు తుడిచెను
నీ చెంవను కొట్టిన దెబ్బలు
నా నోటిని శుద్ది చేసెను ॥2॥
నీ శిరస్సున గుచ్చిన ముండ్లు
నా మోసపు తలపును త్రుంచెను ॥2॥
ఎంత త్యాగవూరితమో నీప్రేమా…
ఎంత క్షమాభరితమో నీప్రేమా… ॥తలుచుకుంటె॥

2. నీ దేహము బీరిన కొరడా
నా కామమును బీిల్చెను
నీ చేతుల కాళ్ళకు మేకులు
నా చీకటి దారి మూసెను ॥2॥
సిలువ నెత్తుటి ధారలు
నా కలుషమును కడిగి వేసెను ॥2॥
ఎంత త్యాగవూరితమో నీప్రేమా…
ఎంత క్షమాభరితమో నీప్రేమా… ॥తలుచుకుంటె॥

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account