Chorantians Bible Quiz
View Allమార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు
మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2)
నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2)
ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ
జలములు నాపైకి లేచిననూ (2)
సంకెళ్లు నను బిగదీసిననూ
శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను||
జీవితమంతా శూన్యమైననూ
బంధువులందరు నను విడచిననూ (2)
వ్యాధులెన్నో నను చుట్టిననూ
అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను||