Chorantians Bible Quiz
View Allమారిపోవాలి ఈ లోకమంతా
మారిపోవాలి ఈ లోకమంతా
చేరరావాలి ప్రభుయేసు చెంత (2)
మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ (2)
పంచుకోవాలి పరవారితో ||మారిపోవాలి||
మనము వెలగాలి ఒక దివ్య వెలుగై (2)
వెలిగించాలి ఈ జగతినంతా (2)
కదలి రావాలి కరుణంత మనలో (2)
కరిగిపోవాలి కఠినాత్ములంతా (2) ||మారిపోవాలి||
మనము బ్రతకాలి విలువైన బ్రతుకు (2)
బ్రతికించాలి ప్రభుయేసు బోధ (2)
ఆదుకోవాలి నర జాతినంతా (2)
అందించాలి ప్రభు వాక్యమెంతో (2) ||మారిపోవాలి||
మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ (2)
మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ (2)
వినిపించాలి మన సాక్ష్యమంతా (2)
కదిలించాలి హృదయాలనంతా (2) ||మారిపోవాలి||