మారుతుంది నీ జీవితం
Shalem Rajuమారుతుంది నీ జీవితము వేదన చెందకుమా
మరచిపోడు నిను యేసయ్య మాటే నమ్ము సుమా
మోసే భారం నువు చేసే త్యాగం
ఎదురీతలన్ని యెద కోతలన్ని
చూసేను నా దైవం చేయ్యునులే సాయం “2”
ఆలస్యం అయిందని ఆక్రందన చెందకు
రోజులు మారవని రోధించకు
ఆ రోధననే ఆరాధనగా మనుగడనే మాధుర్యముగా
మలచును నా దైవం విడువకు నీ ధైర్యం
నీ కథ మారిందని నిరాశలో ఉండకు
నీ వ్యధ తీరదని చింతించకు
నీ చింతలనే చిరు నవ్వులుగా యాతననే స్తుతి కీర్తనగా
మార్చును నా దైవం వీడకు విశ్వాసం