మహాఘనుడవయ్యా నా యేసయ్యా
మహాఘనుడవయ్యా నా యేసయ్యా
మహోన్నతుడవయ్యా నా యేసయ్యా ॥2॥
మహాగొప్ప కార్యములు నీ సొంతం
మహాఅధ్బుతములు నీ సొంతం ఆ… ఆ…॥2॥
హెబ్రీయుడైతే చంపమని
ఫరో చెప్పెను ఆనాడు ॥2॥
హెబ్రీయుడైన మోషేనే
ఫరో పెంచడం ఆశ్చర్యం ॥2॥
ఏలీయాను చంపుటకై
వెదకుచుండెను ఆహాబు ॥2॥
యెజెబెలు ఊరైన సీదోనులో
నీవు ఏలియాను దాచుట ఆశ్చర్యం ॥2॥
మానవజాతి అంతయును
పాపములో పడియుండెను ॥2॥
మానవజాతి రక్షణకై
నీవు మానవుడవుట ఆశ్చర్యం ॥2॥
ప్రభువువచ్చును దొంగవలె
బహుగా త్వరపడి సిద్దపడుదాం ॥2॥
ఆ దినమున పంచభూతములు
లయమైపోవుట ఆశ్చర్యం ॥2॥