Chorantians Bible Quiz
View Allమహిమగల రాజా
Sathish Kumarమహిమగల రాజా – నిన్నే స్తుతియింతుము
మహోన్నత దేవా – నిన్నే కీర్తింతుము
యేసురాజా – రాజుల రాజా – నిన్వే స్తోత్రింతుము
యేసురాజా – రాజుల రాజా – మా సర్వం నీకిత్తుము
కష్టమైన నష్టమైన – నిన్నే కొనియాడెదం
శోధనలైన వేదనలైనా – నీకై జీవింతుము
ఎన్ని నిందలొచ్చినా – ఎన్ని బాధలొచ్చినా
నీకొరకే మేం నిలుతుము ॥యేసు॥
1. నత్తివాడైన మోషేను – నాయకుడిగా చేసెను
గొల్లవాడైన దావీదును – గొప్పరాజుగా మార్చెను
బానిసైన యోసేవును – బహుగా బహుగా దీవించెను
2. విరికివాడై పేతురును – పౌరుషముతో నింపెను
పొట్టివాడైన పౌలును – గట్టివాడిగా చేసెను
అనుమానించే తోమాను – సిలువ సాక్షిగా మార్చెను.
3. దుక్కిదున్నే ఏలీషాను – దీర్ణదర్శిగా మార్చెను
బాలుడైన సమూయేలును – యాజకునిగా మార్చెను
బలపీనుడైన గిద్యోనును – బలాఢ్యునిగా మార్చెను
4. దిక్కులేని హదస్సాను – మహా రాణిగా చేసెను
మోడుబారిన రూతును – బోయజు భార్యగా మార్చెను
మగ్దలేని మరియను – మారుమనసుతో నింపెను