మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం
మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం
మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2)
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు లేనే లేదు
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు అసలే లేవు
నీ రాజ్యం మాకొచ్చును గాక
నీ చిత్తం భువిపై జరుగును గాక
పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము
ఇప్పుడే అనుభవిస్తాము – (2)
ఇక్కడే అనుభవిస్తాము
సిలువలో మన శాపం తొలగిపోయెను
ఆశీర్వాదముకు మనము వారసులం
దారిద్య్రముతో లేదు మాకు సంబంధం
ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మాకిక సొంతము
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మా సొంతము ||నీ రాజ్యం||
ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై
కలసి జీవించుటయే పరలోక రాజ్యం
కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు
సంతోషముతో మేము సాగిపోతాము
ఈ తరానికి మాదిరిగా మేముంటాము
పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం (2) ||నీ రాజ్యం||