Chorantians Bible Quiz
View Allమంగళమే యేసునకు – మానుజావతారునకు
మంగళమే యేసునకు – మానుజావతారునకు (3)
శృంగార ప్రభువునకు (2)
క్షేమాధిపతికి మంగళమే ||మంగళమే||
పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3)
నిరుపమానందునకు (2)
నిపుణ వేద్యునకు మంగళమే ||మంగళమే||
దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3)
కరుణా సంపన్నునకు (2)
జ్ఞాన దీప్తునకు మంగళమే ||మంగళమే||
సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3)
నిత్య స్వయంజీవునకు (2)
నిర్మలాత్మునకు మంగళమే ||మంగళమే||
యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)
సత్య పరంజ్యోతి యగు (2)
సార్వభౌమునకు మంగళమే ||మంగళమే||
నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3)
కరుదెంచిన మా పాలి (2)
వర రక్షకునకు మంగళమే ||మంగళమే||
పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3)
పరమేశ్వర తనయునకు (2)
బ్రణుతింతుము నిన్ను మంగళమే ||మంగళమే||