మన్నించే ప్రేమ

Joshua Shaik
3954 Views

మన్నించే ప్రేమ – కనిపించే నీలో – ఆదరించావుగా – నా దేవ నా యేసయా
లాలించే నీ ప్రేమ – ఉప్పొంగే నాలోన – ఏనాటి అనుబంధమో
గుండెల్లో నీవేగా – సంతోష గానంగా – సాగాలి కలకాలము
ఏపాటి నన్ను – ప్రేమించినావు – తీర్చేదెలా నీ ఋణం – నీకేగా ఈ జీవితం

1. నీతో మాట – నీతో బాట – వరమే ఈ పయనం
ఆశే నీవై – ధ్యాసే నీవై – కొలిచే ఈ సమయం
ఉన్నావు తోడు నీడై నాతో – నా యేసయ్యా
దాచావు ఎన్నో మేళ్లు నాకై – నా యేసయ్యా
నీవు లేనిదే – మనలేనుగా – నీవేగా నా ధైర్యము
ఆటంకాలెన్నున్నా అవమానాలెదురైనా
రక్షించే దైవంగా – విశ్వాసం నీవేగా
నీవే కదా యేసయ్య – ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక – నీతోనే బ్రతకాలిక

2. నీవే ప్రాణం – నీవే ధ్యానం – పలికే నా హృదయం
భారం మోసి – బలమే నింపి – మలిచే నా గమనం
చుక్కాని నీవై దారే చూపే – నా యేసయ్య
అందాల లోకం నీలో చూసా – నా యేసయ్య
ప్రతి చోటున నీ సాక్షిగా జీవించే నా భాగ్యము
నా జీవితపయనంలో – బలహీన సమయంలో
ఓదార్చే దైవంగా – నిలిచింది నీవేగా
నీవే కదా యేసయ్య – ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక – నీతోనే బ్రతకాలిక

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account