మీరు బహుగా ఫలించినచో

138 Views

మీరు బహుగా ఫలించినచో
మహిమ కలుగును తండ్రికి
ఈ రీతిగా ఫలించినచో
శిష్యులై యుండెదరు (2)

నీరు కట్టిన తోటవలె
నీటి వూటవలె నుండెదరు (2)
క్షామములో తృప్తి నిచ్చి
క్షేమముగా మిమ్ము నడిపించును (2)
బలపరచును మీ యెముకలను (2)
అధికముగా ఫలించుడి (2)          ||మీరు||

చెట్లులేని మెట్టలలో
నదుల ప్రవహింపజేయు ప్రభువు (2)
ఎండియున్న నేలనెల్ల
నీటిబుగ్గలుగా జేయువాడు (2)
మన ప్రభువైన యేసునందు (2)
అధికముగా ఫలించుడి (2)          ||మీరు||

వడిగా ప్రవహించు నదిని బోలి
విస్తరింపజేయు తన శాంతిని (2)
ఐశ్వర్యముతో నింపు మిమ్ము
ముదిమివరకు మిమ్ము మోయువాడు (2)
మన ప్రభువైన యేసునందు (2)
అధికముగా ఫలించుడి (2)          ||మీరు||

పాడెదరు మూగవారు
గంతులు వేసేదరు కుంటివారు (2)
పొగడెదరు ప్రజలెల్లరు
ప్రభుని ఆశ్చర్య కార్యములను (2)
మహిమ ఘనత చెల్లించుచు (2)
హల్లెలూయ పాడెదరు (2)          ||మీరు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account