మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా

243 Views

మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా
విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2)
వెలిగే దీపానికి నూనె అవసరం
నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2)
నూనె లేని దీపము ఆరిపోవును
ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2)      ||మోకాళ్ళ||

శోధనలో పడకుండా ప్రార్ధించుము
శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2)
కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2)
మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2)      ||మోకాళ్ళ||

ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా
పరలోక సంతోషం దేవుడిచ్చును (2)
పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము (2)
ఆకాశ జలములను మూసివేసెను (2)      ||మోకాళ్ళ||

అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును
అన్నాడు మన యేసు అడిగి చూడుము (2)
సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు (2)
అడిగిన వారందరికి తప్పక దయచేయును (2)      ||మోకాళ్ళ||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account