నా ఆశల పల్లకి నీవే
Palepogu Lazarbabuనా ఆశల పల్లకి నీవే – ఆశలు తీర్చిన ఆరాధ్యుడా
ఆశించగానే ప్రతి అవసరము నీదుమహిమలో తీర్చినావయ్య
నిరాశతో నా జీవితమును
నింపుకొని నేను మూగనైనా
నోరు తెరిచి సంధ్యారాగము తో
జీవన నావను నడిపించుచున్నా
ఎండకు కాలిన మహారణ్యములో
దప్పిగొని నేను అలసిపోయిన
నా దరి చేరిన స్నేహ క్షేత్రమా
జీవజలములతో తృప్తిపరచితివే