నా ఆత్మీయ యాత్రలో
Hosanna Ministriesనా ఆత్మీయ యాత్రలో అరణ్యమార్గములో
నాకు తోడైన నా యేసయ్య నిను ఆనుకొని జీవించేద
నేనేల భయపడను నా వెంట నీవుండగా
నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగా
శేష్టమైన నీ మార్గములో నిత్యమైన నీబహువుచాపి
సంమృద్దిజీవము నాకనుగ్రహించి నన్ను బలపరిచిన నా యేసయ్య
నిను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను ||నేనేల॥
పక్షిరాజువలె పైకేగురుటకు నూతన బలముతో నింపితివి
జ్వేష్టుల సంఘములో నను చేర్చి పరిశుద్దపరచే యేసయ్య
అనుదినము నిన్ను స్తుతించుటకు నేను జీవింతును ||నేనేల |
సియోను దర్శనము పొందుటకు ఉన్నత పిలుపుతో పిలిచితివి
కృపావరములతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్య
నీ రాక కొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము ॥నేనేల॥|