నా చేరువై నా స్నేహమై

Joshua Shaik
19999 Views

నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య

నీ ప్రేమలోనే నేనుండిపోనీ
నీ సేవలోనే నను సాగనీ
నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
నీ వాక్కు నాలో నెరవేరనీ

నా వరం నా బలం నీవే నా గానం
నా ధనం నా ఘనం నీవే ఆనందం
తోడుగా నీడగా నీవే నా దైవం
ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం

1. నా వేదనందు – నా గాయమందు
నిను చేరుకున్నా – నా యేసయ్య
నీ చరణమందు – నీ ధ్యానమందు
నిను కోరుకున్నా – నీ ప్రేమకై
కరుణించినావు నను పిలచినావు
గమనించినావు ఘనపరచినావు
నీవేగా దేవా నా ఊపిరి

2. నా జీవితాన – ఏ భారమైన
నీ జాలి హృదయం – లాలించెనే
ప్రతికూలమైన – ఏ ప్రళయమైన
ప్రణుతింతు నిన్నే – నా యేసయ్య
విలువైన ప్రేమ కనపరచినావు
బలపరచి నన్ను గెలిపించినావు
నీవేగా దేవా నా ఊపిరి

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account