నా దేవా నీవే కరుణించరావా
Joshua Shaikనా దేవ నీవే – కరుణించరావా
నాలోన నీవే – నివసించరావా
కడదాక యేసు – నడిపించరావా
1. నీ ధ్యాసే – నాలో – అభయం
నీ ప్రేమే – కోరా – నిరతం
దీవిస్తావనీ – నిను చూడాలనీ – నా మౌన గీతం
గమనిస్తావనీ – బదులిస్తావనీ – ఈ ప్రేమరాగం
నా తల్లివై – నా తండ్రివై – నా యేసుదేవా
నను ఆదరించరావా
2. నీలోనే – సాగే – పయనం
నీ ఒడిలో – చేరే – తరుణం
మాటిస్తావనీ – మరుగేకావనీ – నీ తోడు కోసం
మొరవింటావనీ – వెలిగిస్తావనీ – నా ఆత్మ దీపం
ఉన్నానుగా – వేచానుగా – నా యేసుదేవా
నను ఆదరించరావా