నా జీవిత భాగ్యమే
Palepogu Lazarbabuనా జీవిత భాగ్యమే నీ కృపలో నిలిచియుండుట
ఆనందమానందమే ఆహా! ఎంత మాధూర్యమే
ఆధారం నీవే నా ఐశ్వర్యం నీవే ఇహాపరములలోన ఆశ్రయం నీవే
1. నాకాలు జారెనని కలవరపడినా కృపయే కదా,.. స్థిరపరచింధి
నాచేయిపట్టి వెనుతట్టి ధృదపరచి నే కోరినట్టి శిఖరమును ఎక్కించే
‘నాయేసయ్యా.. నాకు ఆధారమై సన్నుతి గానాలు పలికించెలే
2. ఏమైయున్నను ఏస్థితిలో ఉన్నను కృపయే కదా..విడువనది
నా కేమున్న లేకున్నా ఈ లోకంలో సిరిసంపదలన్ని నీలోనే అని నమ్మినా
నా యేసయ్యా.. నాకు విశ్వర్యమై ఆనంద గానాలు పలికించెలే
3. పర్వతాలు తొలగి మొట్టలు దద్దరిల్లిన కృపయే కదా..దైర్యపరచింది
ఏ కష్టనష్టాలనైనా కడతేర్చి నీ అభీష్టములకై నే శిరము వంచగా
నా యేసయ్యా. నాకు ఆశ్రయమై విజయగానాలు పలికించెలే