నా జీవితాంతము నీ సేవ చేతునంటిని

175 Views

నా జీవితాంతము
నీ సేవ చేతునంటిని
నే బ్రతుకు కాలము
నీతోనే నడుతునంటిని
నా మనవి వింటివి
నన్నాదుకొంటివి (2)        ||నా జీవితాంతము||

నీ ప్రేమ చూపించి
నన్ను నీవు పిలిచితివి
నీ శక్తి పంపించి
బలపరచి నిలిపితివి (2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2)       ||నా జీవితాంతము||

రోగముతో పలుమార్లు
పడియుండ లేపితివి
ఘోరమై పోకుండా
స్థిరపరచి కాచితివి (2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2)       ||నా జీవితాంతము||

దూషించు దుష్టులకు
సిగ్గును కలిగించితివి
వేలాది ఆత్మలకు
మేలుగ నన్నుంచితివి (2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2)       ||నా జీవితాంతము||

సంఘములు కట్టుటకు
సామర్ధ్యమిచ్చితివి
ఉపదేశమిచ్చుటకు
దేశములు తిప్పితివి (2)
నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2)       ||నా జీవితాంతము||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account