Chorantians Bible Quiz
View Allనా జీవితం ప్రభు నీకంకితం
నా జీవితం ప్రభు నీకంకితం
నీ సేవకై నే అర్పింతును (2)
నీ మహిమను నేను అనుభవించుటకు
నను కలుగజేసియున్నావు దేవా (2)
నీ నామమును మహిమ పరచు
బ్రతుకు నాకనుగ్రహించు (2) ||నా జీవితం||
కీర్తింతును నా దేవుని నే
ఉన్నంత కాలం (2)
తేజోమయా నా దైవమా
నీ కీర్తిని వర్ణించెద (2) ||నా జీవితం||