నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు

159 Views

నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2)
అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2)
పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్        ||నా నాథుడా||

దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2)
యావత్తు పెంటయనుచు (2) నిదిగో         ||నా నాథుడా||

ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2)
ఆశ కల్గించు నాలోన (2) నీవే             ||నా నాథుడా||

పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2)
కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు        ||నా నాథుడా||

భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2)
పాతకుడ నేనైతిని (2) మహా          ||నా నాథుడా||

ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2)
సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు        ||నా నాథుడా||

హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2)
ఉల్లమందానంద ధ్వని (2) యిదియే       ||నా నాథుడా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account