నా ఊహకందని నీ ప్రేమ

1152 Views

నా ఊహకందని నీ ప్రేమ – ఎన్నడు మరువని ప్రేమ
శాశ్వతమైనది ఆ ప్రేమ – ఎన్నడు విడువని ప్రేమ
వర్ణించలేని నీ ప్రేమ – ఎల్లలే లేని ఆ ప్రేమ
అ ప : ప్రియ యేసూ ఇది మాకు ఉచితముగా దొరికిన వరమా

1. నా అన్నవారే వెలివేసినను
ఏకాకిగా చేసి నను త్రోసినను
నా దరి చేరి నను ఓదార్చావు
చెంతనున్నావు నన్ను ఆదరించావు

2. వేదన బాధలు వెంటాడినను
శోధన శ్రమలు నను భయపెట్టినను
నా దరి చేరి నను ఓదార్చావు
వెన్ను తట్టావు నాకు ధైర్యమిచ్చావు

3. లోకస్తుల నిందలు విసిగించినను
స్నేహితులు నా పైన పగబట్టినను
నా దరి చేరి నను ఓదార్చావు
పైకి లేపావు నాకు క్షేమమిచ్చావు

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account