నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే… యేసయ్యా

1638 Views

నా ప్రతి అవసరము
తీర్చువాడవు నీవే… యేసయ్యా
నా ప్రతి ఆశ
నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా

ఆకలితో నే అలమటించినప్పుడు
అక్కరనెరిగి ఆదుకొన్నావు (2)
వందనం యేసయ్యా
నీకే వందనం యేసయ్యా
నా ప్రతి అవసరము
తీర్చువాడవు నీవే… యేసయ్యా
నా ప్రతి ఆశ
నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా

ఊహించలేని ఆశ్చర్య కార్యములతో
ఏ కొదువ లేక నను కాచుచుంటివి (2)
కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినా
నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు             ||వందనం||

తప్పిపోయినా త్రోవ మరచినా
నీ కృప నన్ను విడచి వెళ్ళదు (2)
నీ కృప – విడచి వెళ్ళదు నన్నెప్పుడు (2)
యేసయ్యా..
నా ప్రతి విన్నపం
నీ చెంత చేరునేసయ్యా – యేసయ్యా
నా ప్రతి ప్రార్థనకు
జవాబు నీవే యేసయ్యా – యేసయ్యా (2)

వందనం యేసయ్యా
నీకే వందనం యేసయ్యా
ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై
యేసయ్యా… వందనం

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account