నా స్నేహ బంధమా
నా స్నేహ బంధమా – నన్ను విడిపోలేదు
నా ప్రాణ బంధమా – నన్ను విడిపోలేదు
నాకు ఆధారమైనావు నీవు – నాకు ఆనందమైనావు నీవు
మరువనయ్యా నా యేసయ్యా విడువనయ్యా నా యేసయ్యా (2)
1. జారిపోయే వేళలో నన్ను జారిపోనీయక నా చేయి పట్టి నడిపించావే నీవు
(2)
నా ఆతిశయం నా ఆశ్రయమే నీవు
నేను నమ్మదగిన నా చెలిమియే నీవు
॥మరువనయ్యా॥
2. నేను కృంగియున్న వేళలో నన్ను కృంగిపోనియ్యక
నా వెన్నుతట్టి నడిపించావే నీవు నీ కృపయు నా క్షేమమే నీవు
నేను నమ్మదగిన నా స్నేహమే నీవు (2)
॥మరువనయ్యా||