Chorantians Bible Quiz
View Allనాకు చాలిన దేవుడ నీవు
నాకు చాలిన దేవుడ నీవు
నా కోసమే మరణించావు (2)
నా శ్రమలలో నా ఆధారమా
నను ఎడబాయని నా దైవమా (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఏ రీతిగా నిను స్తుతియించగలను (2) ||నాకు చాలిన||
వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె
మౌనివై నా పాప శిక్షణోర్చినావు (2)
అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా (2)
చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2) ||ఏమిచ్చి||
ఎండిన భూమిలో లేత మొక్క వోలె
నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా (2)
సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో (2)
నడవలేక సుడి వడి కూలినావయ్యా (2) ||ఏమిచ్చి||