Chorantians Bible Quiz
View Allనాకున్న బలము సరిపోదయ్యా
నాకున్న బలము సరిపోదయ్యా
నాకున్న జ్ఞానము సరి కాదయ్యా (2)
ఆత్మతో నింపి అభిషేకించు
(నీ) శక్తితో నింపి నను నడిపించు (2) ||నాకున్న||
నిన్ను విడిచి లోకంలో సౌలు వలె తిరిగాను
నిన్ను మరచి యోనాలా నిద్రలో మునిగాను (2) ||ఆత్మతో||
మనసు మారి పౌలు వలె నిన్ను చేరుకున్నాను
మనవి ఆలకించమని పెనుగులాడుచున్నాను (2) ||ఆత్మతో||
అనుమానంతో నేను తోమలా మారాను
అబ్రాహాములా నీతో ఉండగోరుచున్నాను (2) ||ఆత్మతో||